0:00 ఫస్ట్ ఒక చిన్న మాట చెప్తా. ఇదొక డిస్క్లైమర్ అనుకోండి. ఇప్పుడు నేను చెప్పబోయేది నా మాటలు కాదు. ఒక సీనియర్ ఐపీఎస్ వ్యక్తం చేసిన అభిప్రాయం. ఇక టాపిక్ లోకి వెళ్తే యూనిఫామ్ లో ఉన్న క్రిమినల్ ఎవరు? ఆన్సర్ మీకు తెలుసా? నన్ను చెప్పమంటారా? సజ్జనార్ అంటారా? సరే మీ ఇష్టం. ముందే చెప్పినట్టు ఇది నేనో మీరో చెప్తున్న మాట కాదండి. స్వయంగా ఒక ఐపీఎస్ ఆఫీసరే ఈ మాట సోషల్ మీడియాలోనే పోస్ట్ చేశారు. అసలు సజ్జనార్ గురించి ఎందుకు ఆ ఆఫీసర్ అంత పెద్ద మాట అన్నారు?
0:32 ప్రభుత్వం సజ్జనార్ ను బదిలీ చేసిన తర్వాత ఇది ఎందుకు అంత హాట్ టాపిక్ గా మారింది? సజ్జనార్ పై ఆ ఐపీఎస్ ఆఫీసర్ కు మాత్రమేనా ఇంకెవరికైనా కోపం ఉందా? దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ సజ్జనార్ బదిలీ వెనకున్న ప్రకంపనల గురించి మాట్లాడుకోవాలి. సజ్జనార్ బదిలీ అయిన తర్వాత సీబీఐ మాజీ డైరెక్టర్ ఎం నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో భారీ ప్రకంపనలు సృష్టించాయి. తన మాజీ సహచరుడిని ఉద్దేశించి ఆయన సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టులు ఇప్పుడు
1:02 రాజకీయ వర్గాల్లోనూ పెను చర్చకు దారి తీశాయి. సజ్జనార్ ను యూనిఫామ్ వేసుకున్న నేరస్తుడు అంటూ నాగేశ్వరరావు తీవ్ర పదజాలంతో విమర్శించారు. తనతో ఒకప్పుడు కలిసి పని చేసిన వ్యక్తిని ఇలా బహిరంగంగా విమర్శించాల్సి రావడం బాధాకరమే అయినప్పటికీ ఉన్నది ఉన్నట్లు చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందని ఆయన స్పష్టం చేశారు. వ్యక్తిగత అనుబంధాలు, సర్వీసు స్నేహాల కంటే ప్రజా ప్రయోజనాలే ముఖ్యమని తేల్చి చెప్పారు. సజ్జనార్ ను సీపీ పదవి నుంచి తొలగించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, డీజీపీ సీవీ ఆనంద్ కు కృతజ్ఞతలు
🔒 The full, searchable transcript is available with Pro.